హార్రర్‌ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్‌ ఐశ్వర్యరాయ్‌!

Wednesday, January 22, 2025

స్నేహా ఉల్లాల్‌ గురించి తెలుగు సినిమాకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు పరిశ్రమ ఐశ్వర్యరాయ్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా..టాలీవుడ్‌ అగ్ర హీరో బాలయ్య బాబు పక్కన ఆడి పాడింది. కానీ ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు.చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుంది.

స్నేహా ఈసారి కామెడీ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు భవనమ్ అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ బ్యానర్‌ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.

 స్నేహ ఉల్లాల్‌తో పాటు టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్స్ సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్  ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర కలిసి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల  చేశారు.  టీజర్ సన్నివేశాలు ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ఆ టీజర్ లో చూస్తుంటే టైటిల్ కు తగ్గట్లే పెద్ద భవనం కనిపిస్తుంది. కాసేపు భయపెడుతూనే, నవ్విస్తుంది.  ప్రస్తుతం ఆడియన్స్ ను ఈ టీజర్  ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ కమెడీయన్స్ అందరు కడుపుబ్బా నవ్వించారు. సమ్మర్ స్పెషల్‌గా మే లో భవనమ్ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles