మెగా మేనల్లుడితో ఐశ్వర్య లక్ష్మి!

Sunday, December 22, 2024

విరూపాక్ష సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్‌ ని అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ ఆ తరువాత బ్రో సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ ఉన్నాడు. రోహిత్ కేపీ ఈ సినిమాతో డైరెక్టర్‌ గా  ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ చిత్రం పట్టాలెక్కింది. ఈ  సినిమాలో తేజ్‌ కి జోడిగా  హీరోయిన్‌గా ఐశ్వ‌ర్య ల‌క్ష్మిని సెలెక్ట్‌ చేసినట్లు
సమాచారం.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అక్క‌డ ఓ ప‌ల్లెటూరి సెట్ ని రూపొందించి అందులో సినిమా ప్రధాన భాగాన్ని అంతా రూపొందిస్తున్నారని సమాచారం. తేజ్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణంపై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ అనే టైటిల్  ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దాన్నే ఫిక్స్ చేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ కథ స్వాతంత్య్ర కాలం నాటి క‌థ ఇది. 1947 ప్రాంతంలో ఓ ఊర్లో ఏం జ‌రిగింది? అనే ఇతి వృత్తంతో ఈ సినిమా న‌డుస్తుంది.  ‘విరూపాక్ష‌’ క‌మ‌ర్షియ‌ల్ గా పెద్ద హిట్ కొట్టింది. దాంతో.. ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ బ‌డ్జెట్ వెసులుబాటు ద‌క్కింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles