అందర్ని ఆకట్టుకునేలా ఆయ్‌!

Wednesday, January 22, 2025

ఎన్నో హిట్టు సినిమాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తాజాగా రాబోతున్న మూవీ ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక ఈ సినిమాలో జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ మూవీతో దర్శకుడిగా బాధ్యతలను చేపట్టారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. శుక్రవారం ఈ సినిమా  నుంచి థీమ్ సాంగ్‌ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ ‘ఆయ్’ అని టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అని అందరూ అనుకున్నారు. దాని కోసం ఇరవై రకాల వేరియేషన్స్‌లో అనుకున్నాం. కానీ ఆయ్‌  టైటిల్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఈ కథను ఒప్పుకున్న నితిన్ కి థాంక్స్. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని నటుడు నితిన్ అన్నారు.

దర్శకుడు అంజి కె.మ‌ణిపుత్ర‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా, ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు కూడా హీరో పక్కన అద్భుతంగా నటించారు.

అజయ్ మంచి పాటలు ఇచ్చారు. బన్నీ వాస్ ఆల్ రౌండర్ అన్న విషయం తెలిసిందే. ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. అమ్మాయిలను ప్రకృతితో పోల్చుతాం. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.. ఇక ఎన్నో హిట్ ఫిలిమ్స్ అందించిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles