టెలివిజన్‌ ప్రీమియర్‌కు రెడీ అయిన ఆయ్‌!

Sunday, January 19, 2025
టాలీవుడ్‌లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించగా ఆగస్టు 15న ఈ సినిమా మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి ఆదరణ అందించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ నార్నె, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో కూడా  సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడంతో ఇది ట్రెమెండస్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమయ్యింది.

‘ఆయ్’ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా నవంబర్ 17న మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు ఛానల్ ప్రసారం చేయనుంది. దీంతో బుల్లితెరపై ఈ యూత్‌ఫుల్ కామెడీ రొమాంటిక్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా  ఎదురూ చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles