పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్‌ సినిమా చేసేది అతడితోనే!

Friday, December 5, 2025

పాన్ ఇండియా ఐకాన్ స్టార్, జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా రష్మికా  హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “పుష్ప 2” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇక ఈ సినిమాపై భారీ హైప్ రాగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయనున్న సినిమాలు ఎవరితో అనే  విషయం కూడా ఇప్పుడు ఫిక్స్‌ అయిపోయింది.

మరి వీటిలో దర్శకుడు త్రివిక్రమ్ తో ఆల్రెడీ ఓ సినిమా ఫిక్స్ కాగా తన లైనప్ లో మరో దర్శకుడు అట్లీతో కూడా సినిమా ఉంటుంది అని ఆ మధ్య ఓ టాక్‌ నడిచింది. అయితే దీనిపై బన్నీ కాంపౌండ్ నుంచి అసలు క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా కానీ లేదా త్రివిక్రమ్ తో సినిమా కానీ మొదలు పెట్టనున్నాడని సమాచారం.  దీంతో అల్లు అర్జున్ లైనప్ లో అట్లీ సినిమా గ్యారంటీగా ఉందని ఇప్పుడు కన్ఫర్మ్‌ అయిపోయింది. మరి ఆ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో  ముందు సినిమా మొదలు పెట్టనున్నాడో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles