అదిరింది భయ్యా..మొత్తం పాపులర్ మీమ్సేగా!

Sunday, December 22, 2024

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ ….మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని బిగ్గెస్ట్‌ పాన్‌ వరల్డ్‌ మూవీగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ భామలు దీపికా, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ సినిమాలో బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..అంతే కాదు ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్ కూడా…ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఇప్పటికే టాక్‌ నడుస్తుంది. ఈ సినిమాతో చిత్ర బృందం ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులకి అర్థంకావడం కోసం.. మేకర్స్ ఒక యానిమేటెడ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ సిరీస్ కు బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ ను పెట్టారు. రెండు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. ఫ్యూచర్ లో రాబోయే అడ్వాన్స్డ్ వెహికల్స్ ,వెపన్స్ వంటివి ఈ సిరీస్ లో చూపించారు.ఈ సిరీస్ లో ఎంటెర్టైనేమేంట్ కోసం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ ని నాగ్ అశ్విన్ బాగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ తో వున్న స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles