అసలే రజినీ ఫ్యాన్‌..!

Saturday, December 21, 2024

సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ సినిమా వస్తుందంటే కేవలం ఇటు భారత్‌ అభిమానులు మాత్రమే కాకుండా అటు జపాన్‌ లో ఉన్న అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే రజినీ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్‌ మూవీ వేట్టయాన్‌. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కించింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, లిరికల్ సాంగ్ రెండు కూడా సూపర్‌ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రజనీకాంత్ సినిమాలు విడుదల అంటే తమిళనాడులో ఓ పండగ వాతావరణం ఏర్పడుతుంది. విడుదలకు ముందు రోజు నుండే కటౌట్లు, పాలాభిషేకాలు, అభిమానుల సందడితో చేసే రచ్చ మామూలుగా ఉండదు.

అదేవిధంగా రజినీ సినిమా థియేటర్లలోకి వస్తుంది అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది.  గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగులుకు  హాలిడే ప్రకటించాయి. అలా ఉండేది తమిళనాడులో రజనీ మ్యానియా.

ఇక తలైవా నటించిన లేటేస్ట్ సినిమా ‘వేట్టయాన్‌’ మద్రాసు లో 656 షోస్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్లో అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు సెలవును ప్రకటిస్తూ లెటర్ విడుదల చేసాయి. రజనీ స్టామినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తగ్గదని అది మా హీరో స్టామినా అని తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles