థీమ్ ఆఫ్ క‌ల్కి కోసం న‌టి శోభ‌న నృత్యం!

Tuesday, July 2, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ లో చిత్ర బృందం ఫుల్‌ బిజీగా ఉంది. ‘క‌ల్కి’ సినిమా నుంచి వ‌రుస అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై అంచ‌నాల‌ను ఒక్కసారిగా పెంచేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ‘థీమ్ ఆఫ్ క‌ల్కి’ అనే సాంగ్ ను విడుదల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ క్రమంలోనే ఈ సాంగ్ ను మ‌థురలో విడుదల చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ థీమ్ సాంగ్ కోసం న‌టి శోభ‌న ఓ స్పెష‌ల్ డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇక ఈ పాట ను త్వ‌ర‌లోనే విడుదల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం వెల్లడించింది.

‘క‌ల్కి 2898 AD’ మూవీలో ప్ర‌భాస్ హీరోగా నటిస్తుండ‌గా అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువ‌ల్ వండ‌ర్ మూవీని అశ్విని ద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles