టాలీవుడ్‌లో ఇటీవల పాత తరానికి చెందిన హీరోయిన్‌లు తిరిగి వెండితెరపై కనిపిస్తున్నారు. ఒకప్పటి స్టార్‌లైన లయ, అన్షు, జెనీలియా ఇప్పటికే రీఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు అదే దారిలో మరో హీరోయిన్ కూడా కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది.
2001లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో సినీ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆ చిత్రంలో హీరోగా ఆకాష్, హీరోయిన్‌గా రేఖ నటించారు. తన అమాయకమైన లుక్స్‌తో, సహజమైన నటనతో రేఖ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్ని సినిమాల తర్వాత ఆమె అకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమైంది.
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రేఖ మళ్లీ తెరపైకి రావడానికి సన్నద్ధం అవుతోంది. ఇటీవల ఓ యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలోనూ ఆమె చురుకుగా ఉంటూ అభిమానులతో కలిసిపోతోంది. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన అందం, యాక్టింగ్ మీద నమ్మకాన్ని చూపిస్తోంది.
