డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీరామ్‌ అరెస్ట్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా గుర్తింపు పొందిన నటుడు శ్రీరామ్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను చెన్నై పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళ సినిమా వర్గాల్లో కలకలం రేగింది.

తాజా సమాచారం ప్రకారం, శ్రీరామ్ ఒక రాజకీయ నాయకుడితో సంబంధాలు ఉన్న వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకున్నారని చెన్నై నార్కోటిక్స్ విభాగం అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకొని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ రక్త నమూనాలను పరీక్షించారు. తర్వాత అధికారులు శ్రీరామ్‌ను విచారించటం కూడా జరిగింది.

ఇప్పటికే ఈ కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి. వారిలో కొందరితో జరిగిన విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా శ్రీరామ్ పేరును బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కేవలం ఒక్కరిపై కాదు, మొత్తం సినీ పరిశ్రమపైనే ప్రశ్నలు రేపేలా మారుతోంది.

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఓ నేత పేరు ఈ కేసులో వినిపించడంతో, మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డ్రగ్స్ సంబంధిత అంశాలు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.

ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవడం ఇండస్ట్రీకి షాకింగ్ విషయంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles