నటుడు ప్రసాద్‌ బెహరా అరెస్ట్‌!

Friday, December 20, 2024

ప్రముఖ యూ ట్యూబ‌ర్‌, న‌టుడు ప్ర‌శాంత్ బెహ‌రా లైగింక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. స‌హ‌చ‌ర న‌టిపై లైంగిక వేధింపులు, దాడి య‌త్నం కేసులో ప్ర‌సాద్ బెహ‌రాని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ తరువాత కోర్టుకు హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంత‌రం చంచ‌ల్ గూడా జైలుకి తరలించారు.

వివ‌రాల్లోకి వెళ్తే… ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో త‌నతో ప్ర‌సాద్ బెహ‌రా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అయితే అప్పుడే నిల‌దీయ‌డంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పినట్లు..అంతేకాక ఆ త‌ర‌వాత మ‌రో షూటింగ్ లో కూడా  త‌న శ‌రీరాన్ని తాకే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, ఇదేమిట‌ని అడిగితే, ప‌రుష ప‌ద‌జాలంతో తిట్టడంతో పాటు ఇంటికి వెళ్తున్న దారిలో, దాడికి దిగాడని  ఓ యువ‌తి జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

ఇందుకు సంబంధించి సాక్ష్యాలు కూడా ఉండ‌డంతో ప్ర‌సాద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం కోర్టుకు హాజ‌రు ప‌రిచారు.యూ ట్యూబ్ ద్వారా న‌టుడిగా ప్రసాద్‌ బెహరా అందరికీ పరిచయమే. స‌హ‌జ‌మైన న‌ట‌న‌, కామెడీ టైమింగ్ తో ఆక‌ట్టుకొన్నాడు. త‌ను మంచి రైట‌ర్ కూడా. ఓ ద‌శ‌లో.. `ఓజీ` సినిమాకు ప‌ని చేసే అవ‌కాశం కూడా వచ్చింది. అయితే అది మిస్‌ అయ్యింది. ఇప్పుడు వెండి తెర‌పై న‌టుడిగా బిజీ అయ్యాడు. న‌రేష్ న‌టించిన `బ‌చ్చ‌ల‌మ‌ల్లి`లో ఓ పాత్ర పోషించాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles