ఆమెతో నటించడం మాత్రం నా వల్ల కాదు!

Wednesday, January 22, 2025

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మహారాజ సినిమాతో వస్తున్నాడు. ఈ క్రై, సస్పెన్స్‌ థ్రిల్లర్  చిత్రాన్ని నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో  అనురాగ్‌ కశ్యప్‌, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. మహారాజ జూన్‌ 14న థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతి శెట్టి గురించి మరోసారి విజయ్‌ సేతుపతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కూతురిగా చేసిన కృతి శెట్టితో  హీరోగా నటించడం తన వల్ల కాదని విజయ్‌ సేతుపతి తెలిపారు. ‘నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటే.. చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పా. అందుకు కారణం ఉప్పెన చిత్రంలో ఆమెకు తండ్రిగా నటించడమే. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయడం నా వల్ల కాదు. అందుకే  కృతి వద్దు అని డీఎస్పీ చిత్ర బృందానికి చెప్పాను. ఉప్పెనలో కొన్ని క్లైమాక్స్‌ సీన్స్‌ చేస్తున్నప్పుడు కృతి చాలా కంగారు పడింది. ఆ సమయంలో నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు, నన్ను నీ తండ్రిగా భావించు అని ధైర్యం చెప్పాను. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించాలి. అది నా వల్ల కాదు’ అని విజయ్‌ చెప్పుకొచ్చారు.

ఉప్పెన చిత్రంతోనే కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే విజయ్‌ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. బేబమ్మగా కృతి.. రాయణంగా విజయ్‌ నటించారు. ఈ ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చిత్ర యూనిట్ కృతిని ఎంపిక చేయగా.. మక్కల్ సెల్వన్ తిరస్కరించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles