తన ప్లాప్‌ సినిమాల గురించి స్టార్‌ హీరో స్పందన!

Wednesday, April 2, 2025

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్‌గా ఉన్నా చాలా ఎమోషనల్ గా ఉంటాడు. ఇటీవలే నిర్వహించిన 60 అండ్‌ నాట్‌ డన్‌ – ది స్క్రీన్‌ అండ్‌ స్పాట్‌లైట్‌ అనే సెషన్‌లో అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయితే ఫీల్‌ అయ్యి వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. ఆ సినిమాలో మనం చేసిన తప్పులేంటని చిత్రబృందంతో చర్చించి.. ప్రేక్షకులు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుని వాటిని మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకుంటూ ఉంటాను’ అని అమీర్ ఖాన్ తెలిపారు.

అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘మనం చేసిన తప్పులేంటని తెలిస్తే.. తర్వాత చెయబోయే సినిమాల్లో తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. అప్పుడు సెట్స్ లో నేను ఉత్సాహంగా నటిస్తాను’ అని అమీర్ ఖాన్ చెప్పారు. ఇక గతంలో తాను నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాల్లో నేను బాగా నటించాను అనుకున్నాను. కానీ ఇవి బాక్సాఫీసు వద్ద ఆశించిన  ఫలితాలను చేరుకోలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles