శంబాలతో రెడీగా ఉన్న ఆది!

Saturday, January 18, 2025

ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ వస్తుంది. అలాంటి ఓ మిస్టిక్ ప్రపంచంలో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మూవీ మేకర్స్‌ లాంచ్‌ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు.

టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే ‘శంబాల’ కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్‌ చాలానే ఉన్నట్టుగా కనపడుతుంది. డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఓ డిఫరెంట్‌ ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమా లో ఆదికి జోడీగా యాక్ట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న యుగంధర్‌, ‘శంబాల’ సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు.

ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్‌ పరంగా, టెక్నికల్‌ గా సినిమాను “టాప్‌ క్లాస్‌”అనే రేంజ్‌లో నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles