మరో స్టార్‌ డైరెక్టర్‌ తో మొదలు పెట్టిన యంగ్‌ రెబల్‌ స్టార్‌!

Wednesday, December 25, 2024

పాన్ ఇండియా హీరో,  యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తాజాగా రూపొందించిన “కల్కి 2898 ఏడీ’. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించగా..బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పడుకొణే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్ చిత్ర షూటింగ్ లో ఫుల్‌ బిజీగా ఉన్నాడుప్రభాస్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతీ రాజాసాబ్ చిత్రానికి దర్శకత్వ భాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకునిగా ఈ సినిమాకి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాజా సాబ్ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రానికి పచ్చ జెండా ఊపేశాడు.

సీతారామం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవ పూడి రెబల్ స్టార్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవలే ముగిసాయి. బౌండెడ్ స్క్రిప్ట్ ను హనురాఘవపూడి ప్రభాస్ కు చెప్పగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా మూవీగా రానుంది. రెబల్ స్టార్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు హను రాఘవాపుడి. అక్టోబరు నుండి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు “ఫౌజి” అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles