ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి చూసిన మాస్ యాంగిల్‌కు ఇది మరింత అప్‌గ్రేడ్ అయ్యేలా ఉండబోతోంది.
ఇక తాజా షెడ్యూల్ విషయానికొస్తే, జూలై 28వ తేదీ నుంచి వారం రోజులు ఈ చిత్రం షూటింగ్ రాత్రి సమయంలో జరుగుతుంది. కథలో కీలకమైన నైట్ సీన్లను ఈ సమయంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. షూటింగ్ స్పాట్‌లో భారీ సెటప్‌లు కూడా సిద్ధం చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో రామ్‌కి కీలకంగా సహాయం చేసే పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నారు. అలాగే, కథకు రొమాంటిక్ టచ్ ఇవ్వడానికి భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్నారు. డ్యూయో వివేక్-మెర్విన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్‌కి బాక్సాఫీస్ వద్ద మరో హిట్ అందించాలనే ఆశతో రూపొందుతోంది. అప్‌డేట్స్‌ను బట్టి చూస్తే, సినిమా కథ, టెక్నికల్ టీమ్, నటీనటుల కాంబినేషన్‌తో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
