SDT18 కోసం వెర్సటైల్ నటుడు!

Wednesday, January 22, 2025

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే  చాలా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి  క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ బీస్ట్ మోడ్‌లోకి మారినట్లుగా ఇప్పటికే మేకింగ్ గ్లింప్స్ వీడియోలో చూపించారు.

అయితే, ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఇచ్చారు. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఓ కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఆయన సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడో  అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది

ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles