విజయ్ దేవరకొండ తాజా సినిమా “కింగ్డమ్” మీద ఇప్పుడు టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. విజయ్ కెరీర్ పరంగా ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే గతంలో వచ్చిన “ది ఫ్యామిలీ స్టార్” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అందుకే ఈసారి విజయ్ గట్టి హిట్ తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక బిజినెస్ పరంగా చూస్తే, కింగ్డమ్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసమే సుమారు 50 కోట్లకు పైగా డీల్ కుదిరినట్టు ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన చూస్తే, సినిమా సక్సెస్ అవ్వాలంటే కనీసం 100 కోట్లకి పైగా వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత బజ్ ను చూస్తే ఓపెనింగ్ డేస్ లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి సినిమా ఎలా ఆడుతుంది అనే దానిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ మొదటిగా సినిమా మీద క్రేజ్ మాత్రం గట్టిగానే కనిపిస్తుంది.
