‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. నాగ చైతన్యతో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘NC 24’పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ దర్శకుడు ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో మరో ముఖ్యమైన అడుగు వేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం జరిగి, పెళ్లికి తొలి ఆరంభం అయింది.
కార్తీక్ వర్మ దండు, హర్షిత అనే యువతితో వివాహ బంధం కాబోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుక చాలా ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జంటగా హాజరై జంటను ఆశీర్వదించారు. సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై వేడుకలో భాగమయ్యారు.
ప్రస్తుతం కార్తీక్ దండు, హర్షిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
