సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు రోహిత్ కె.పి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తుండగా పూర్తి హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. కాగా, ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ పూర్తి మేకోవర్‌తో కనిపిస్తున్నాడు.
అయితే, ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వె్న్స్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను వెయ్యికి పైగా మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ అత్యంత గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ‘హను-మాన్’ మూవీ నిర్మాతలు కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.