సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ముందు అభిమానుల్లో ఉత్సాహం పెంచేందుకు చిత్రబృందం ఇప్పటికే పాటలు, స్పెషల్ వీడియోలు షేర్ చేసింది. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌గా చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఆడియో వేడుకను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. సన్ నెక్స్ట్‌లో ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్ సరదాగా చేసిన ప్రసంగం, ఇతర నటీనటుల అనుభవాలు, అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ ఇచ్చిన లైవ్ ప్రదర్శనను ‘Coolie Unleashed’ పేరుతో ప్రేక్షకులకు అందించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి పలువురు ప్రముఖులు నటిస్తున్నారు.
