జటాధర కోసం రంగంలోకి సూపర్‌ స్టార్‌!

Thursday, December 4, 2025

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “జటాధర” ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డివోషనల్ టచ్ ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రేపు అక్టోబర్ 17న ట్రైలర్ విడుదల కానున్న వార్తతో మహేష్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఈ సినిమాకు రాయిస్ అండ్ జైన్ – సామ్ సంగీతం అందిస్తుండగా, ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ ఆరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా కలిసి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles