ప్రభాస్‌ స్పిరిట్ లో స్పెషల్‌ సాంగ్‌!

Friday, March 14, 2025
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో  వస్తున్న తాజా సినిమా స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తెలుస్తుంది. ఇప్పటికే, ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట వైరల్‌ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సంగీత డైరెక్టర్‌  హర్షవర్ధన్ రామేశ్వర్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ స్పెషల్ సాంగ్ ‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినపడుతుంది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ‘కియారా అద్వానీ’ ఈ స్పెషల్ సాంగ్ ‌లో కనిపించనుందనే వార్త వినపడుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం  ఉందో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కాంబోలో భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు సమాచారం.

‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles