సాలిడ్‌ సీక్వెల్‌ రెడీ అవుతుంది!

Sunday, January 19, 2025

ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఉన్న ఆల్ టైం కల్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది హిందీ మూవీ “తుంబాడ్”. మరి ఈ చిత్రం అప్పట్లో ప్లాప్ అయినప్పటికీ ఇపుడు మళ్ళీ రీ రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా అప్పుడుకి మించి భారీ వసూళ్లు అందుకుంది. మరి ఈ రీ రిలీజ్ తోనే మేకర్స్ దీనికి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేశారు. ఇక ఈ సీక్వెల్ పై లేటెస్ట్ గా దర్శకుడు అనీల్ రాహి బార్వె సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

దీంతో ఈ క్రేజీ థ్రిల్లర్ కి ఒకటి కాదు రెండు సీక్వెల్స్ ఉంటాయని తేల్చి చెప్పేశారు. తన తుంబాడ్ నుంచి రెండో భాగం  2026 లో మొదలు కానుందని  తెలిపారు. దీనితో ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ  డైరెక్టర్‌ నెట్ ఫ్లిక్స్ లో భారీ వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్” అనే సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత సహా బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles