సంవత్సరాంతంలో చిన్న చిత్రంగా విడుదలైన “డ్రింకర్ సాయి” మూవీ పెద్ద విజయాన్ని అందుకున్నవిషయం తెలిసిందే. ధర్మ, ఐశ్వర్య శర్మ కథాకథానాయికులుగా నటించిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లు అందుతున్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూసి స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అంటూ లెక్కలు చెబుతున్నాయి.
“డ్రింకర్ సాయి”లోని కథా కథనాలు మేకింగ్ అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. తెలంగాణతో పోల్చిచూస్తే ఏపీలో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్స్ వసూలు అవుతున్నాయి.
ఫన్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ, సూపర్ హిట్ మ్యూజిక్, ఫైట్స్..ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. ‘‘డ్రింకర్ సాయి’’ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ సినిమాని తీశారు.
గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు వచ్చిన “డ్రింకర్ సాయి” మూవీ యునానమస్ గా సూపర్ హిట్ టాక్ అందుకుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది.