ఒక్క అక్షరం ఆమె జీవితాన్ని మార్చేసింది!

Sunday, March 16, 2025

తెలుగు సినిమాల్లోకి మలయాళం భామలు చాలామందే వస్తుంటారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్‌ చేసిన ప్రేమలు సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. నిజానికి మలయాళంలో సూపర్ హిట్ అవడంతో దాన్ని తెలుగులోకి రాజమౌళి కుమారుడు కార్తికేయ తీసుకొచ్చాడు.

ఇక అటు మలయాళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా హీరోయిన్ మమితకి వరుస సినీ అవకాశాలు క్యూ కడుతున్నాయి.అయితే ఆమె తన పేరు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. అసలు మమిత అనేది తన  పేరు కాదని, తన పేరు మారడం వెనుక పెద్ద స్టోరీనే ఉందంటూ చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన అసలు పేరు నమిత అట, పుట్టినప్పుడు హాస్పిటల్‌ సిబ్బంది బర్త్‌ సర్టిఫికెట్‌లో పొరపాటున ‘N’ అనే అక్షరానికి బదులు ‘M’ అనే అక్షరాన్ని రాశారని ఆ దెబ్బతో నమిత అవ్వాల్సిన తాను మమిత అయ్యానని చెప్పుకొచ్చింది.

అయితే బర్త్‌ సర్ట్‌ఫికెట్‌ తీసుకుంటున్న సమయంలో కూడా మా పేరెంట్స్‌ చూసుకోలేదు, సరిగ్గా స్కూల్‌లో జాయిన్‌ అవ్వాల్సిన సమయంలో ఈ విషయాన్ని వారు గమనించారు. అయితే ముందు మార్చాలి అని అనుకున్న సరే ఇది కూడా  కాస్త కొత్తగా ఉంది కదా అని భావించి ఉంచేసారట. అలా ఉంచడానికి కారణం ఏంటంటే ఆ పేరుకి మలయాళంలో తీపి  అని అర్థం వస్తుంది. సరే అని అలాగే ఉంచేయడంతో నమిత కావాల్సిన తాను మమితనయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles