అఖండ 2 లో దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌!

Friday, December 5, 2025

నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ “అఖండ 2 తాండవం” పట్ల ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం అఖండ ఇచ్చిన విజయాన్ని బట్టి ఈసారి మరింత గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారని సినిమా వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇక చాలా రోజులుగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న “సెకండ్ హాఫ్ కర్స్” కి ఈ సినిమా సమాధానం చెప్పబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే ఈసారి బాలయ్య అండ్ బోయపాటి జోడి రెండో అర్థంలో కూడా సాలిడ్ పంచ్ ఇవ్వబోతుందన్న నమ్మకం ఉంది.

ఇక తాజాగా ఈ సినిమాపై మరో క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. అఖండ పాత్రలో బాలయ్య చేసే సీన్‌ థియేటర్లలో ప్రేక్షకులను షాక్‌ చేసేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో “తాండవం” అనే టైటిల్‌ పెట్టడానికి కారణం కూడా అదే అంటున్నారు సినీ వర్గాలు. ఆ సీన్‌లో బాలయ్య తన స్టైల్‌లో, ఆగ్రహభరితమైన లుక్‌తో, శివుడి తాండవం లాంటి ఎనర్జీతో కనిపించబోతారని టాక్ నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles