బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్‌ను ఘనంగా సత్కరించింది. పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన కాయిన్ పై షారుఖ్ బొమ్మ, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు షారుఖ్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదలైంది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖానే. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు బాద్‌షా నే కావడం విశేషం. భారతీయ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా మూడు దశాబ్ధాలకు పైగా షారుఖ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.