ఆ సినిమాకి నో చెప్పిన నేచురల్‌ స్టార్‌!

Tuesday, January 21, 2025

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారిన వారిలో బలగం వేణు ఒకరు. తొలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్‌ రాజ్‌ బ్యానర్‌ లో వేణు రూపొందించిన సినిమా బలగం సూపర్‌ హిట్‌ సాధించి అనేక హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. బలగం సక్సెస్ అవ్వడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు.

అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ క‌థ‌ను వినిపించారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు న‌డిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఎందుకో ఆగింది. ఎందుక‌నో వేణుతో ప్రాజెక్ట్ చేయ‌టానికి నాని సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ‘బలగం’ వేణు మ‌రో హీరోని వెతుక్కునే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఇద్ద‌రు హీరోల‌కు ఆయ‌న క‌థ నెరేట్ చేశారు. వారిలో ఒకరు నితిన్‌, మ‌రొక‌రు విశ్వ‌క్‌సేన్‌. ప్ర‌స్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ఈ, వేణు శ్రీరామ్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నాడు.

సో నితిన్ ఇప్పుడే వేణుకి దొరికే ఛాన్స్‌ లేదు. ఇక మరొక హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ నాలుగు సినిమాల షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. వాటిలో మెకానిక్ రాకీ సినిమాను ఈ నెల 31న విడుదల చేయబోతున్నాడు. వేణు చెప్పిన కథకు విశ్వక్ కి నచ్చినా కూడా సినిమా చేయలేని పరిస్థితి. బ‌ల‌గం వంటి హిట్ త‌ర్వాత వేణు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. బడా నిర్మాత చేతిలో ఉన్నా కూడా వేణుకి ఎందుకనో హీరో మాత్రం దొరకడం లేదు. మరి వేణు ఈ ద్వితీయ విజ్ఞం ఎప్పుడు దాటతాడో ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాల్సిందే మరి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles