దడ పుట్టించే క్యారెక్టర్ లో నేచురల్‌ స్టార్‌!

Sunday, December 22, 2024

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. పోయిన సంవత్సరం నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నాయో తెలిసిన సంగతే. అంతే కాకుండా ఆ సినిమా దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో.

నానితో దసరా సినిమాను తెరకెక్కించిన  శ్రీ‌కాంత్ ఓదెలతో మరో సినిమా  చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలవనుంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు నిర్మాతగా సుధాకర్ చెరుకూరి. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. నాని ఈ  సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని  అందులో ఒక పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని  తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది.

అందుకు తగ్గట్టుగా భారీ, భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ తో ఈ మూవీ పోస్ట‌ర్‌ ను డిజైన్ చేశారు చిత్ర బృందం. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ వుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రియాంకా మోహన్, SJసూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సరికొత్త కథనంతో అభిమానుల ముందుకు రానుంది.  ఈ సినిమా ఆగష్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles