మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల హర్షం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు వరుసగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుండగా, ఆయన తమ్ముడు పవర్ స్టార్ – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన విషెస్ కి చిరంజీవి ఇచ్చిన స్పందన అందరినీ ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు ప్రేమతో కూడిన సందేశం పంపగా, చిరంజీవి తన స్టైల్‌లోనే ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. ఆయన చెప్పిన మాటల్లో అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించింది. పవన్ పట్టుదల, సేవా తపనపై గర్వం వ్యక్తం చేస్తూ, జనసైనికులను ఒక నాయకుడిలా నడిపించాలని ప్రోత్సహించారు. అలాగే పవన్ ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని, తన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నాడు.
