మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి వరుస సర్ప్రైజ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విశ్వంభర సినిమాతో ఒక స్పెషల్ ట్రీట్ అందించిన మెగాస్టార్, ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న తాజా ఎంటర్టైనర్ నుంచి మరో భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్ టాక్ చెబుతోంది.
ఈ సినిమాపై అధికారిక అప్‌డేట్ కూడా వచ్చేసింది. రేపు ఉదయం 11 గంటల 25 నిమిషాలకు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు రెడీగా కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.
ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు శివ శంకర్ ప్రసాద్‌గా ఉండబోతుందని సమాచారం. దాని గురించిన క్లారిటీ కూడా రేపు బయటకు రానుంది. సంగీతం భీమ్స్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సాహు గారపాటి చూసుకుంటున్నారు.
