బాలీవుడ్ లో ఆ స్టార్‌ హీరో పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసిన మహానటి!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ లో రెండవ సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న నటి.. కీర్తి సురేష్‌. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా టాలీవుడ్‌ నుంచి చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్‌ లో నటించేందుకు క్యూ కడుతున్నారు. వారిలో రష్మిక ముందంజలో ఉంది. వరుసలో ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ కూడా ఆ లిస్టులోకి చేరింది.. బాలీవుడ్ లో మరో ఆఫర్ ను పట్టేసింది..ఎప్పుడు పద్దతిగా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌ లో  వరుణ్‌ ధావన్‌ తో కలిసి బేబి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆమె మరో ఆఫర్‌ ను కూడా అందుకున్నట్లు తెలుస్తుంది.

 బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త నిజమైతే కీర్తిసురేష్ క్రేజ్ బాలీవుడ్ లో విపరీతంగా పెరగడం ఖాయం. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా అలియా భట్, కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. వాళ్ళతో పాటు కీర్తి సురేష్ కూడా ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles