గేమ్ ఛేంజ‌ర్, దేవ‌ర.. రెండింటిలోనూ ఒకటే!

Wednesday, December 25, 2024

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుల్లో రామ్‌ చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ ఒకటి అయితే… మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర సినిమాల గురించి ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు క్రియేట్‌ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

గేమ్ ఛేంజ‌ర్ సినిమాను కోలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌గా, దేవ‌ర సినిమాను కొర‌టాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల‌పై కూడా అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అయితే, ఈ రెండు సినిమాల్లోనూ ఓ పాయింట్ ఒకేలాగా ఉండ‌టం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాల్లో కూడా హీరోలు రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ తండ్రి, కొడుకు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. తండ్రిగా రైతు పాత్ర‌లో, కొడుకుగా ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో చ‌ర‌ణ్ యాక్ట్ చేస్తున్నాడు. అటు దేవ‌ర సినిమాలోనూ తండ్రీకొడుకుల పాత్ర‌లో తారక్ క‌నిపిస్తాడు.

ఇక ఈ రెండు సినిమాల్లోనూ తండ్రికి అన్యాయం చేసిన‌వారిపై కొడుకు ప‌గ‌తీర్చుకునే అంశాన్ని మ‌న‌కు చూపించ‌బోతున్నారు. ఈ రెండు సినిమాల నేప‌థ్యం వేరైనా, క‌థ‌లోని పాయింట్ ఒక‌టే అని సినీ వ‌ర్గాల్లో సమాచారం. ఇక గేమ్ ఛేంజ‌ర్ మూవీ సింగిల్ పార్ట్ లో వ‌స్తుండ‌గా, దేవ‌ర రెండు పార్ట్ ల‌లో విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles