బుక్‌ రాస్తానంటున్న ముద్దుగుమ్మ!

Thursday, January 23, 2025

ఇటీవలే కేరళ స్టోరీ, బస్తర్ సినిమాలతో సూపర్‌ హిట్స్ సాధించిన అదా శర్మ ప్రస్తుతం అన్ని భాషల్లో మూవీస్‌  చేస్తూ తీరిక లేకుండా ఉంది. తాజాగా అదా శర్మ తెలుగులో ‘C.D (క్రిమినల్ లేదా డెవిల్)’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ అన్నం డైరెక్షన్‌లో ఎస్‌ఎస్‌సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అదా శర్మ ప్రధాన పాత్రలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిడి (క్రిమినల్ ఆర్ డెవిల్)’.

ఇటు సినిమాలతో అటు వెబ్ సిరీస్ లతో అదాశర్మ బిజీబిజీగా ఉంది. ఆమె నటించిన తాజా సిరీస్‌ ‘రీటా సన్యాల్‌’ ఈ రోజు నుంచి ఓటీటీ ‘డిస్నీ+హాట్‌ స్టార్‌’ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ది కేరళ స్టోరీ’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకుంది.

అలాగే, రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది. వాటికి మించి ప్రేక్షకుల హృదయాల్లో నాకు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. నిజానికి ది కేరళ స్టోరీకి ముందు నేను ఎన్నో సార్లు నిరాశ చెందాను. ఆ సమయంలో ది కేరళ స్టోరీ వచ్చింది. ఆ కథ పై ఎంతో చదివాను. ఒక విధంగా దానిపై నేను పుస్తకం కూడా రాయగలనంటూ నవ్వుతూ సమాధానం తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles