గ్యాంగ్‌స్టర్‌ కి నటించాలనుందంటున్న ముద్దుగుమ్మ!

Tuesday, January 21, 2025

అటు కోలీవుడ్ నటులతో పాటు ఇటు టాలీవుడ్‌ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో స్టార్ యాక్టర్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా కూడా ఒకటి.  ఈ సినిమా  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థియేటర్ల సందడి చేయబోతుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆమె ప్రశ్నోత్తరాల సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.

మీ డ్రీమ్ రోల్ ఏంటి అని ఓ అభిమాని మాళవికను అడగగా, గ్యాంగ్ స్టర్ గా నటించాలని ఉందని తెలిపింది. ఈ సెషన్ లో తంగలాన్ సినిమా  గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తంగలాన్ కోసం తొలిసారి స్టంట్స్ చేసినట్లు కూడా వివరించారు. సినిమా చాలా బాగుంటుందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఈ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ లో మాళవిక మోహనన్ కూడా ఓ హీరోయిన్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles