ఓ కన్ఫ్యూజన్‌ డ్రామా అంతే..

Tuesday, January 21, 2025

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో “వెంకీ అనిల్ 3” అనే మూవీ చేస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా తాజాగా వినిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని, దర్శకుడు అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ ను ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా వెంకీ – హీరోయిన్స్ మధ్యలో వచ్చే కన్ ఫ్యూజ్ డ్రామా ఫుల్ ఫన్ తో  నడుస్తుందని సమాచారం.

ఎలాగూ కామెడీ క్రియేషన్ లో అనిల్ రావిపూడికి మంచి పేరు అయితే ఉంది. అందుకే, ఈ సినిమాలో కూడా కామెడీ అదిరిపోతోందని అంచనాలు ఉన్నాయి. అన్నట్టు త్వరలోనే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles