తమన్నా పై కేసు నమోదు..ఎందుకంటే!

Friday, July 5, 2024

పాన్‌ ఇండియా సినిమాల్లో మంచి ఆదరణ ఉన్న హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. అయితే గత కొంత కాలంగా సినిమాలు తగ్గించి వెబ్‌ సిరీస్‌ లలో ఎక్కువగా కనిపిస్తుంది. తమన్నా ఈ మధ్య కాలంలో రజినీ కాంత్ సినిమా జైలర్ లో కనిపించింది. తాజాగా తమన్నా బాక్‌ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే తమన్నా వీటితో పాటుగా పలు ఎండోర్స్ మెంట్స్ కి కూడా ప్రమోట్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు అలా చేసిన ఓ ప్రమోషన్ ఆమెపై కేసు నమోదు అయ్యేలా చేసింది.  ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే ప్రస్తుతం భారదేశంలో మోస్ట్ పాపులర్ క్రికెట్ ఫార్మాట్ ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అధికారికంగా ప్రసారం చేసే హక్కులు బుల్లితెరపై స్టార్ సంస్థకి ఓటిటిలో జియో, వియాకామ్ 18 అనుబంధ జియో సినిమా యాప్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో వీటికి కూడా అనధికారికంగా స్ట్రీమ్ చేసే ఎన్నో ఇతర మాధ్యమాలు ఉన్నాయి. మరి వీటిలో ఓ బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లే అనే యాప్ ని తమన్నా  ప్రమోట్ చేస్తూ అందులో కూడా ఐపీఎల్ ని చూడొచ్చంటూ ప్రమోట్ చేసింది. దీనితో ఇలా ఎలా ప్రమోట్ చేస్తారని వియాకామ్ 18 వారు మహారాష్ట్ర కోర్టుకెక్కారు. దీనితో ఆమెపై ఇప్పుడు సైబర్ కేసు నమోదు అయ్యింది. దీనితో ఆమె ఈ ఏప్రిల్ 29 లోపు వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై తమన్నా ఏం చేస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles