మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే కోట్లాది అభిమానులు గర్వపడతారు. అలాంటి అభిమానుల్లో ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే గృహిణి తన అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించారు. చిన్నప్పటి నుంచే చిరు సినిమాలు చూసి మెచ్చుకున్న ఆమె, తన హీరోని ఒక్కసారి కలవాలనే కోరికతో సైకిల్ మీదే ఆదోని నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలుపెట్టారు.
ఈ విషయమంతా చిరంజీవి చెవిలో పడగానే, ఆయన ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. అక్కడ ఆమెతో పాటు పిల్లలను కూడా ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్బంలో రాజేశ్వరి మెగాస్టార్ కి రాఖీ కట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ క్షణాలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
అదే సమయంలో చిరంజీవి తన సహృదయాన్ని మరోసారి నిరూపించారు. రాజేశ్వరి పిల్లల చదువుల భాధ్యతను తనదైన స్టైల్లో తీసుకుంటానని చెప్పి, వారు బాగా చదువుకొని తల్లి కోసం నిలబడాలని హితవు పలికారు. ఈ సన్నివేశం చూసిన రాజేశ్వరి కంటతడి పెట్టుకోవడం అందరినీ కదిలించింది.
