ఈ ఏడాదిలో తెలుగు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో వెంకీ మామ హీరోగా, ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించిన అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఒకటి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా నచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం ఏమిటంటే, ఈ కథను హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తి చూపుతున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే, కానీ అదే మేజిక్ హిందీలో పునరావృతం అవుతుందా అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడం, అలాగే హిందీ ప్రేక్షకులు ఇప్పుడు రీమేక్ సినిమాలపై అంత ఆసక్తి చూపకపోవడం ఈ ప్రాజెక్ట్‌పై సందేహాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల హిందీలో వచ్చిన చాలా రీమేక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థితి ఉంది. అల వైకుంఠపురములో హిందీ వెర్షన్‌కి కూడా పెద్దగా స్పందన రాకపోవడం ఈ అంశాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ మరో రీమేక్ ప్రయత్నం చేయడం సాహసమే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
