కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద హిట్ సినిమాల్లో కాంతార పేరు ముందుగా చెప్పుకోవాలి. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగానూ కనిపించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా మొదటి భాగమే అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. భారత్ లో మాత్రమే కాకుండా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యూఎస్ లో కన్నడ వెర్షన్ కంటే ఎక్కువ వసూళ్లు తెచ్చింది మన తెలుగు వెర్షన్.
మొదటి రోజు నుంచే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కన్నడ వర్షన్ కంటే ఎక్కువ షేర్లు, ఎక్కువ ఓపెనింగ్స్ తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. అక్కడ మొత్తం కలెక్షన్లు ఒక మిలియన్ డాలర్లను దాటగా, అందులో అరవై శాతం కంటే ఎక్కువ మొత్తం తెలుగు వెర్షన్ నుంచే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. మిగతా వసూళ్లు కన్నడ, హిందీ మరియు ఇతర భాషల నుంచి వచ్చాయి. దీనితో తెలుగు ఆడియెన్స్ ఇచ్చిన సపోర్ట్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది.
