పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఎప్పుడూ అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఇంతకాలం రీమేక్ లు చేసినా రికార్డులు బద్దలు కొట్టడంలో ఆయనకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ పవన్ కి ఒక ఒరిజినల్ స్టోరీ, సరైన దర్శకుడు, స్ట్రాంగ్ ప్రెజెంటేషన్ కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సమాధానం “ఓజి” రూపంలో బయటపడింది.
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రిలీజ్ కాగానే అంచనాలను మించి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఓపెనింగ్స్ మీద అందరి దృష్టి పడింది. ఇంతవరకు పవన్ సినిమాల కలెక్షన్లు అధికారికంగా బయటకు రాకపోయినా, ఈసారి మాత్రం మేకర్స్ స్పష్టంగా ఫిగర్స్ ప్రకటించారు.
మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుందని టీమ్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. దీంతో పవన్ కెరీర్‌లోనే కాకుండా సౌత్ మొత్తం, భారతీయ సినిమా హిస్టరీలోనూ “ఓజి” ఓ లెజెండరీ రికార్డు ఓపెనర్ గా నిలిచింది.
