పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి”పై ఉన్న క్రేజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకి వచ్చిన హైప్ చూస్తుంటే పవన్ కెరీర్‌లోనే కాకుండా మొత్తం సౌత్ లో కూడా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా టికెట్ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. అమెరికాలో ఇప్పటికే మిలియన్ల డాలర్ల గ్రాస్ సాధించగా, తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి. ఇది వరల్డ్ లోనే రెండో పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ కావడం మరింత హైలైట్ అయ్యింది. అంతే కాకుండా అక్కడ పెరిగిన డిమాండ్ కారణంగా మేకర్స్ మరో అదనపు షో కూడా ఏర్పాటు చేశారు.
