యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, రితిక నాయక్ జోడీగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన భారీ విజువల్ ఎంటర్‌టైనర్ “మిరాయ్” విడుదలైన తర్వాత మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కోసం మొదటినుంచే ఉన్న అంచనాలు బాక్సాఫీస్ వద్ద కూడా నిజమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతంలో హిందీ వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకంగా అమెరికా మార్కెట్ లో మిరాయ్ అదరగొట్టే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 1.8 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ బలమైన రన్ కొనసాగించింది. ఈ వేగం చూస్తుంటే త్వరలోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
