టాలీవుడ్‌లో కొత్తగా వస్తున్న హారర్ మూవీ ‘కిష్కింధపురి’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తుండగా, హారర్ సినిమాల్లో ఇప్పటివరకు చూడని కొన్ని కొత్త అంశాలను చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. థ్రిల్లింగ్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి ఈ సినిమా సిద్ధమైంది.
ముందుగా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేసినా, ఇప్పుడు రిలీజ్ డేట్‌లో మార్పు చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు. శనివారం రోజు రిలీజ్ అవుతుండటంతో సినిమా ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
