దీపావళికి మిత్రమండలి పటాకా!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్‌లో రూపొందుతున్న మరో ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘మిత్ర మండలి’ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు విజయేందర్ సత్తు దర్శకత్వం వహిస్తుండగా, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయ్, నిహారిక ఎన్ఎం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాయి.

పూర్తిగా హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చి తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వులతో అలరించేందుకు సిద్దమవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ, అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు.

‘మిత్ర మండలి’ని బన్నీ వాస్, భాను ప్రతాప్, కళ్యాణ్ మంథిన, సోమరాజు కలిసి నిర్మిస్తుండగా, సంగీతాన్ని ఆర్ ఆర్ ధృవన్ అందిస్తున్నాడు.

Share This Article