లేడీ విలన్‌ తో కనగరాజ్‌ రొమాన్స్‌!

Friday, December 5, 2025

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి వచ్చిన ‘కూలీ’ సినిమాలో కన్నడ నటి రచితా రామ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన నెగటివ్‌ షేడ్‌లతో ఉన్న పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే పాత్రతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో ఆమె గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ తొలిసారి హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాలో ఆయన సరసన నటించేది రచితా రామ్ అని టాక్ వినపడుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles