పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఇటీవల రీలీజ్ అయిన పెద్ద యాక్షన్ మల్టీస్టారర్‌లలో “వార్ 2” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ కీలక పాత్రల్లో కనిపించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర ఊహించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలవకపోయినా, స్థిరంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
హిందీ బెల్ట్‌లో ఈ సినిమా వసూళ్లు చూస్తే, గత శుక్రవారం సుమారు 3.5 కోట్లు నెట్ కలెక్షన్ వచ్చినట్టు సమాచారం. మొత్తం ఇప్పటివరకు ఈ చిత్రం 158 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వీకెండ్ ఎఫెక్ట్ కారణంగా వచ్చే రెండు రోజుల్లో మరోసారి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
