పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి 2898AD, సలార్ సీక్వెల్స్, స్పిరిట్, ఫౌజీ వంటి ప్రాజెక్టులతో పాటు ఆయన నటించిన మరో క్రేజీ సినిమా ది రాజాసాబ్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. హారర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు గ్రాండ్ రిలీజ్ డేట్ ప్రకటించే పనిలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలపై ప్రభాస్ స్వయంగా ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని తెలుస్తోంది. అందులో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక రొమాంటిక్ మెలోడీతో పాటు మాస్ బీట్‌లు కూడా ఉండబోతున్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో కలిసి ఒక స్టైలిష్ మాస్ నంబర్ ఉండగా, మాళవికతో మరో ఎనర్జిటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేశారని సమాచారం. వీటితో పాటు థీమ్ సాంగ్ కూడా సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
కథలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, సప్తగిరి, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, జిషు సేన్ గుప్తా వంటి పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
