గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ “పెద్ది”పై క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే చరణ్ ఊర మాస్ స్టైల్‌లో కనిపించే లుక్ ని చూపించి అభిమానులను ఉత్సాహపరిచారు. కానీ ఇప్పుడు మరో సరికొత్త లుక్ తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా వీడియోలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ మేకోవర్ కోసం రెడీ అవుతున్న సన్నివేశాలు బయటకు వచ్చాయి. స్టైలిష్‌గా డిజైన్ చేసిన హెయిర్ లుక్ తో ఆయన కనిపించగా, ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ పనిచేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ క్లిప్ బయటపడగానే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
బుచ్చిబాబు ఈ సినిమా కోసం రామ్ చరణ్ లుక్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలుస్తోంది. ప్రతి గెటప్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తుండటంతో “పెద్ది”లో ఆయన మేకోవర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
